ఓం తత్ సత్
కృతాయుగంలో ధ్యానము చేత, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేత, ద్వాపరయుగంలో అర్చన చేత,
కలియగమునందు సంకీర్తన చేత భగవంతుడి అనుగ్రహమును చూరగొనవచ్చు. అందుకే కలియుగంలో అన్నిటికంటే సులభమైన మార్గం నామసంకీర్తనం. భక్తి పారవశ్యంతో స్వామి వారి దివ్యలీలా గుణ విశేషములను, వైభవమును ప్రశంసించటమే కీర్తనం. ఈ కీర్తనం వలన భక్తుడు ఆనంద పరమశమవుతాడు.
భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది. ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం, ఆ భక్తి చేయడం అనేది వారి వారి స్థితి గతులను బట్టి నిర్ణయించ బడుతుంది. కొందరు భక్తులు భజన చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.
"శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్ అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమ్, ఆత్మ నివేదనమ్"
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.
బమ్మెర పోతనామాత్యుల వారు ఈ నవవిధ భక్తులను ఇలా మత్తేభంలో ఎంతో చక్కగా వర్ణించారు.
ఈ యాంత్రికకాలం లో పైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సంధర్భం అవసరంలేదు.
మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా సరే, ఇష్టమైన నామాన్ని స్మరించవచ్చు.
మనస్సు చేత, మాట చేత, క్రియ చేత, త్రికరణసుద్ధిగా సర్వాంతర్యామిని ఈ నవవిధ భక్తి మార్గమ్ తో కొలువ వచ్చును.
ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు.
విద్యార్థులు వీటిని దృష్టిలో పెట్టుకుని..
తాము తెలుసుకోవలసిన అంశాల్ని ‘శ్రవణం’ చేయాలి.
గొంతెత్తి ‘కీర్తనం’ చేయాలి.
తాము చదివే విషయాల్ని ‘స్మరణం’ చేయాలి.
అక్షరాలను పదాలుగా భావించి ‘సేవనం’ చేయాలి.
అక్షరాలకు అక్షర దేవతలకు ‘అర్చనం’ చేయాలి.
గురువులకు, తాము చదివే గ్రంథాలకు ‘వందనం’ చేయాలి.
ఆ విజ్ఞాన దేవతకు ‘దాస్యం’ చేయాలి.
పుస్తకాలతో ‘సఖ్యం’ చేయాలి.
తాము చదివే వైజ్ఞానిక గ్రంథాలను దైవంగా భావించి ‘ఆత్మ నివేదనం’ చేసుకోవాలి.
తద్వారా విజయం అనే మోక్ష మార్గాన్ని పొందుతారు. సత్

తద్వారా విజయం అనే మోక్ష మార్గాన్ని పొందుతారు.
No comments:
Post a Comment
G A D H A R I welcomes your valuable comments,
please